The Silent Emotional Control Inside Relationships

The Silent Truth About Relationships That Change You

whatsapp image 2026 05 18 at 1.03.58 pm

వివాహం అంటే ఇద్దరు కలిసి happyగా జీవితం build చేసుకోవడం. ప్రేమ, trust, respect, మనశ్శాంతి ఉండాల్సిన ఈ బంధం… కొన్నిసార్లు తెలియకుండానే ఒకరి dominance, ఇంకొకరి silent pain‌గా మారిపోతుంది. బయట ప్రపంచానికి ఆ couple చాలా happyగా కనిపిస్తుంది. Social mediaలో smiles, family functionsలో closeness, societyలో good image — ఇవన్నీ చూస్తే “ఎంత మంచి జంట” అనిపిస్తుంది. కానీ ఇంటి తలుపులు close అయిన తర్వాత అసలు reality వేరేగా ఉండొచ్చు.

కొన్ని relationships‌లో ఒక వ్యక్తి నెమ్మదిగా ఇంకొకరి thoughts, money, family relations, emotions మీద control సాధించడానికి try చేస్తాడు లేదా చేస్తుంది. మొదట ఇవన్నీ loveలా కనిపిస్తాయి.

“నువ్వు నాకే కావాలి…”
“నీ salary మనిద్దరిదే కదా…”
“నీ family కంటే నేను important కాదా…?”

అని మొదలయ్యే మాటలు… తర్వాత emotional pressure‌గా మారిపోతాయి.

Emotional control ఎలా start అవుతుంది?

ఇది ఒక్కసారిగా జరగదు. చాలా silent‌గా start అవుతుంది.

  • మొదట చాలా care చూపించడం,
  • తర్వాత పూర్తిగా తనవైపు తిప్పుకోవడం,
  • family నుంచి distance చేయడం,
  • “నువ్వు వాళ్ల మాట ఎక్కువ వింటున్నావు” అని చెప్పడం,
  • money విషయాల్లో పూర్తిగా dominance చూపించడం,
  • తన కోరిక fulfill కాకపోతే anger, crying, guilt trip చేయడం…

ఇలా slowగా ఒకరి decision freedom తగ్గిపోతుంది.

చాలామంది దీనిని వెంటనే identify చేయలేరు.

“ఇది care వల్లే…”
“ఇలా ఉండటం normal…”
“adjust అవ్వాలి…”

అని అనుకుంటూ ముందుకు సాగుతారు. కానీ ప్రతిసారి తమ feelings suppress చేస్తూ పోతే… ఒక రోజు తమ personalityనే lose అయిపోయినట్టు అనిపిస్తుంది.

బయట good person… ఇంట్లో different behavior

Societyలో చాలా softగా, respectfulగా కనిపించే కొందరు… ఇంట్లో పూర్తిగా different‌గా ఉంటారు. బయట sweetness… లోపల insults. బయట politeness… లోపల control. ఇది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే society మనిషి real natureను కాదు… బయట కనిపించే imageనే చూస్తుంది.

ఇలాంటి relationships‌లో ఉన్న వ్యక్తి మొదట తన familyకీ నిజం చెప్పలేడు. ఎందుకంటే:

  • “ఇది బయటకు వెళ్తే paruvu పోతుంది” అనుకుంటాడు,
  • “వాళ్లు మారిపోతారు” అని hope పెట్టుకుంటాడు,
  • లేదా “తప్పు నాదే అయి ఉంటుంది” అని feel అవుతాడు.

కొన్నిసార్లు అంతగా emotionally attach అయిపోతారు కాబట్టి… insults కూడా loveలా అనిపించడం start అవుతుంది.

“కొన్ని relationships‌లో మనిషి ఒక్కసారిగా break అవ్వడు… slowగా తనను తాను lose అవుతాడు.”

Love పేరుతో జరిగే financial pressure

కొన్ని relationships‌లో love కంటే money, status, costly gifts, gold ముఖ్యమవుతాయి.

  • salary మొత్తం తన చేతిలో ఉండాలని కోరడం,
  • అవసరానికి మించి expenses చేయించడం,
  • costly gold, gifts కొనిపించుకోవడం,
  • “నన్ను ప్రేమిస్తే ఇది చేస్తావు” అని emotional pressure పెట్టడం…

ఇవి slowగా ఒక వ్యక్తిని financially weak చేస్తాయి.

ఆ వ్యక్తి loans చేసి అయినా relationship save చేయాలని చూస్తాడు. ఎందుకంటే అతనికి లేదా ఆమెకు ప్రేమ lose అవుతామన్న fear ఎక్కువగా ఉంటుంది.

“Fear ఉన్న చోట love కంటే control ఎక్కువగా ఉంటుంది.”

Silentగా suffer అవ్వడం ఎందుకు dangerous?

మన societyలో “adjust అవ్వడం”ని మంచి qualityగా చూస్తారు. కానీ ప్రతి situationలో adjust అవ్వడం healthy కాదు.

నిరంతరం:

  • insults భరించడం,
  • feelings suppress చేయడం,
  • fearతో జీవించడం,
  • ఎప్పుడూ ఎదుటివారి moodకి తగ్గట్టు మారిపోవడం…

ఇవి mental healthని slowగా damage చేస్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో:

  • self-confidence తగ్గిపోవడం,
  • loneliness,
  • anxiety,
  • anger,
  • depression,
  • life మీద interest తగ్గిపోవడం

లాంటివి కనిపించవచ్చు.

Healthy relationship అంటే…

Healthy marriage అంటే:

  • ఒకరి personalityని మరొకరు respect చేయడం,
  • money విషయాల్లో clarity ఉండటం,
  • emotional safety,
  • insulting words లేకపోవడం,
  • familiesని respect చేయడం,
  • మరియు fear మీద కాదు… trust మీద relationship నిలబడటం.

Love అంటే control కాదు.
Love అంటే ఒకరి freedomని destroy చేయడం కాదు.
Love అంటే emotional slavery కాదు.

చివరగా…

ప్రతి problemకి divorce ఒక్కటే solution కాదు. కానీ ప్రతి painని “adjust అవ్వాలి” అని silentగా bear చేయడం కూడా correct కాదు.

Relationship మనసుకు peace ఇవ్వాలి…
తనను తాను lose అయ్యే stageకి తీసుకెళ్లకూడదు.

Society ముందు కనిపించే smiles కంటే… ఇంట్లో మనసుకు దొరికే peaceే అసలు happiness.

— చంద్రకళ వడ్లమూడి
Counselling Psychologist
Founder, Vyana Energy of Well-Being

#Relationships #EmotionalControl #MentalHealth #EmotionalWellbeing #MarriageLife #HealthyRelationships #ToxicRelationships #RelationshipAwareness #CounsellingPsychology #EmotionalAbuseAwareness #MentalHealthAwareness #SelfRespect #EmotionalHealing #MarriageAndMentalHealth #PsychologyAwareness #RelationshipBoundaries #InnerPeace #EmotionalSafety #VyanaEnergy #ChandrakalaVadlamudi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *